Site icon NTV Telugu

PSLV C61: పీఎస్‌ఎల్‌వీ – సి61 ప్రయోగం విఫలం.. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే..

Iso

Iso

ఆదివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టింది. తాజా భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించిన తర్వాత EOS-09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో (ISRO) ధృవీకరించింది. ఫలితాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇలా అన్నారు.. “EOS-09 మిషన్ పూర్తికాలేదు.” “మేము విశ్లేషణ తర్వాత తిరిగి వస్తాము. మూడవ దశ మోటార్ సంపూర్ణంగా ప్రారంభమైంది కానీ దాని పనితీరు సమయంలో సమస్య వచ్చిందని తెలిపారు. PSLV 4-దశల వెహికల్, రెండవ దశ వరకు పనితీరు సాధారణంగా ఉందని తెలిపారు.

Also Read:Off The Record: అక్కడ కూటమిలో 3 పార్టీలకు బదులు 4 పార్టీలు ఉన్నాయా?

EOS-09 మిషన్ జీవితకాలం ఐదు సంవత్సరాలు అని ఇస్రో తెలిపింది. EOS-09 (RESAT-1B) అనేది RESAT-1 ఉపగ్రహాలలో ఒకటి. ఇది రిసోర్స్‌శాట్, కార్టోశాట్ మరియు రిసాట్-2బి సిరీస్ ఉపగ్రహాలకు అనుకూలంగా ఉంటుంది. రాడార్ ఉపగ్రహాలను సంక్షిప్తంగా RESET అంటారు. పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రతకు ఈ మిషన్ చాలా ముఖ్యమైనది. పక్షులు కూడా దాని దృష్టి నుండి తప్పించుకోలేవు. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితులలో, దట్టమైన మేఘాలు, తక్కువ కాంతిలో కూడా అధిక రిజల్యూషన్ లో భూమి ఉపరితలం చిత్రాలను తీయగలదు. ఈ ఉపగ్రహం 24 గంటలూ అంతరిక్షం నుంచి పర్యవేక్షిస్తుంది.

Exit mobile version