PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026 Controversy: పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఐపీఎల్‌ను చూసి పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభించింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. బాల్ ట్యాంపరింగ్, బాల్ గులాబీ రంగులోకి మారడం, అంపైర్ల నిర్ణయాలు ఇలా ఎక్కడ చూసిన వివాదాలే కనిపిస్తున్నాయి. తాజాగా మరో వివాదం చర్చనీయాంశమైంది. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. తారిఖ్ బంతిని విసిరే ముందు ఆగి రావడంపై మిచెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏకంగా రెండుసార్లు క్రీజులో నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి బౌలింగ్‌లో తాను అడనని సంకేతాలు ఇచ్చాడు. బాల్ విసిరేటప్పుడు వింతగా ఆగుతూ బంతిని వేయడం వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటోందని మిచెల్ చెప్పాడు. ఈ ఆసక్తికర సన్నివేశం మ్యాచ్ 9వ ఓవర్లో చోటుచేసుకుంది. ఈ ఓవర్లో మిచెల్ పక్కకు తప్పుకోగా, అంపైర్లు జోక్యం చేసుకుని ఆటను కొనసాగించాల్సిందిగా సూచించారు. అయితే నాలుగో బంతికి ముందు కూడా అదే రిపీట్ కావడంతో అంపైర్లు మిచెల్‌తో చర్చలు జరిపారు.
READ MORE: Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ఇదిలా ఉండగా.. ఉస్మాన్ తారీక్ వివాదాస్పద బౌలర్ అన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమయంలోనే తారిఖ్ యాక్షన్‌పై చర్చ నడిచింది. బంతిని విసిరే ముందు అతను ఆగి, బ్యాటర్ కదలికలను గమనించి, కౌంటర్ డెలివరీ ఇవ్వడం వల్ల బ్యాటర్లకు టైమింగ్ కష్టమవుతుంది. ఈ యాక్షన్‌ను ‘త్రోయింగ్’ అని కొందరు విమర్శిస్తుండగా, ఐసీసీ నిబంధనల ప్రకారమే ఉందని మరికొందరు భావిస్తున్నారు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో ఈ యాక్షన్‌పై ప్రేక్షకులు ట్రోల్ చేశారు, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ వింత యాక్షన్‌తో జింబాబ్వేపై హ్యాట్రిక్, అలాగే కమెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!