పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 13, 14, 16 తేదీల్లో క్వాలిఫైయర్.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే మే 18న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. కాగా.. రావల్పిండి స్టేడియం 11 మ్యాచ్‌లకి, లాహోర్ స్టేడియం 13 మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ, ముల్తాన్ స్టేడియాలు 5 మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే.. పాకిస్తాన్ సూర్ లీగ్ మ్యాచ్‌లన్నీ మార్చి 22 నుండి మే 25 వరకు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 తో ఒకే సమయంలో జరుగుతాయి.
పీఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మాట్లాడుతూ.. “HBL పాకిస్తాన్ సూపర్ లీగ్ యొక్క చారిత్రాత్మక 10వ ఎడిషన్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. గత దశాబ్దంలో HBL PSL ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోర్నమెంట్‌గా ఎదిగింది. ఇది పాకిస్తాన్ క్రికెట్ ప్రతిభను ప్రదర్శిస్తుంది.” అని తెలిపారు. “ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో హై-ప్రొఫైల్ అంతర్జాతీయ క్రికెటర్లు మాత్రమే కాకుండా.. నాలుగు ప్రధాన నగరాల్లో కరాచీ, లాహోర్, ముల్తాన్ మరియు రావల్పిండి స్టేడియాల్లో హై ఓల్టేజ్ మ్యాచ్‌లను చూస్తారు.” అని అన్నారు.
PSL 2025లో విదేశీ ఆటగాళ్లు:
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రిషద్ హొస్సేన్, రిలీ రోసౌ, లిట్టన్ దాస్, డేవిడ్ విల్లీ, కైల్ జామిసన్ వంటి విదేశీ ఆటగాళ్లు PSL 2025 టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. కాగా.. పీఎస్ఎల్ ప్రారంభానికి ముందు ఏప్రిల్ 8న పెషావర్లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లను ఇంకా ప్రకటించలేదు.
Mark your calendars! 🗓️
The #HBLPSLX schedule is HERE! ⚡
Read more: https://t.co/Nh5xUOkEYA
Which match are you hyped for? 🤩#HBLPSL10 l #DECADEOFHBLPSL pic.twitter.com/qAlmbWqt1R
— PakistanSuperLeague (@thePSLt20) February 28, 2025
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 షెడ్యూల్:
ఏప్రిల్ 11 – ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 12 – పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 12 – కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 13 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 14 – ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 15 – కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 16 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 18 – కరాచీ కింగ్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 19- పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 20 – కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 21 – కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 22– ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 23– ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 24 – లాహోర్ ఖలాండర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 25– క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 26– లాహోర్ ఖలందర్స్ v ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 27- క్వెట్టా గ్లాడియేటర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 29– క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 30 – లాహోర్ ఖలందర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 1 – ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 1 – లాహోర్ ఖలందర్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 2 – పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 3 – క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 4 – లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 5 – ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7 – ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 8 – పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 9 – పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 10 – ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 13 – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 13 – ఇస్లామాబాద్ యునైటెడ్ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 14 – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 16 – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 18 – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్