NTV Telugu Site icon

Rishi Sunak: గర్వించదగ్గ రోజు.. సుధామూర్తికి దక్కిన గౌరవంపై స్పందించిన రిషి సునాక్

Sudha Murthy

Sudha Murthy

Rishi Sunak: రచయిత్రి, విద్యావేత్త, పరోపకారి సుధామూర్తి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె సామాజిక సేవకు పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆమె ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి సతీమణి. ఆమె కుమార్తె అక్షతా మూర్తి యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సుధామూర్తి సాధించిన ఘనతపై బ్రిటన్ ప్రధాని, అల్లుడు రిషి సునాక్ స్పందించారు.

సుధామూర్తి కుమార్తె అక్షతామూర్తి తన తల్లి అసాధారణ ప్రయాణంలో అవార్డును అందుకోవడంతో గర్వంగా ఫీలయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ ఇదే విషయంపై స్పందిస్తూ, ఇది “గర్వించదగిన రోజు” అని అన్నారు. “నిన్న నా తల్లి సామాజిక సేవలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకున్నప్పుడు నాకు చెప్పలేని గర్వంగా అనిపించించింది. ” అంటూ ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీనిపై స్పందిస్తూ గర్వించదగ్గ రోజు’అంటూ రిషి సునాక్ వ్యాఖ్యను జోడించారు.

Read Also: Twitter Logo: మళ్లీ మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంత గూటికి బ్లూ బర్డ్!

సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారని, ఆమె జీవితం నాకొక ఉదాహరణ అంటూ అక్షతామూర్తి రాసుకొచ్చారు. గుర్తింపు కోసం ఆమె ఎప్పుడూ ఎదురుచూడరు, కానీ, నిన్న పొందిన గుర్తింపు గొప్ప అనుభూతినిచ్చింది అంటూ ఆమె నొక్కి చెప్పింది. దీనికి ప్రతిస్పందిస్తూ.. ఆమె భర్త, యూకే ప్రధాని రిషి సునాక్ రెండు చప్పట్లు కొట్టే ఎమోజీలతో పాటు, “గర్వించదగ్గ రోజు” అని పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి, ఆమె సోదరి డాక్టర్ సునంద కులకర్ణి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పరోపకారి, ప్రఖ్యాత రచయిత సుధామూర్తి డిసెంబర్ 2021 వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.