పుంగనూరులో పోలీసులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. నల్ల రిబ్బన్లతో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆ నిరసనల్లో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, ఎపీఐడీసీ చైర్మన్ పుణ్యశీల పాల్గొన్నారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని దుయ్యబట్టారు. హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా పుంగనూరు ఊరిలోకి వెళ్తానని చంద్రబాబు మొండికేయడంతో ఘర్షణ మొదలైందని వెల్లంపల్లి తెలిపారు.
Uttar Pradesh: దారుణం.. అబ్బాయిలతో బలవంతంగా మూత్రం తాగించి.. ప్రైవేట్ పార్ట్‌లో మిరపకాయలు రుద్ది..
లా అండ్ ఆర్డర్ కోసమే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ళతో దాడిచేశారని.. అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాడని మండిపడ్డారు. సీఐ అంజూ యాదవ్ ఒక కార్యకర్తను కొడితే పవన్ కళ్యాణ్ హుటాహటిన బయల్దేరాడు.. ఇప్పుడు పోలీసులపై జరిగిన దాడి పవన్ కి కనిపించట్లేదా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి పై వ్యక్తిగత కక్షతో చంద్రబాబు అల్లర్లకు పాల్పడుతున్నారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం చంద్రబాబు వల్లకాదని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.