Site icon NTV Telugu

Wrestlers Protest: పతకాలను గంగానదిలో కలపనున్న రెజ్లర్లు.. ప్రభుత్వంపై పోరుకు నిర్ణయం

Wrestlers

Wrestlers

Wrestlers Protest: మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వారికి లభించిన పతకాలన్నీంటినీ గంగానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ నుంచి రెజ్లర్స్‌ను బలవంతంగా పోలీసులు తొలగించిన తర్వాత తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరమైన హరిద్వార్‌లో గంగలో తమ పతకాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నారు. రెజ్లర్లు ఇప్పటికే హరిద్వార్‌కు బయలుదేరారు. పతకాలను గంగానదిలో నిమజ్జనం చేసిన అనంతరం.. ఢిల్లీకి వచ్చి రేపటి నుంచి నిరాహార దీక్ష కొనసాగించాలని మల్లయోధులు నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Wedding Kit: వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్.. ప్రభుత్వ కొత్త పథకం!

పతకాలు కోల్పోయిన తర్వాత తమ జీవితాలకు అర్థం ఉండదని అయినప్పటికీ, తమ ఆత్మగౌరవంపై రాజీ పడలేమని రెజ్లర్లు చెప్పారు. “…మా మెడలో అలంకరించిన ఈ పతకాలకు ఇక అర్థం లేదనిపిస్తోంది. వాటిని తిరిగి ఇవ్వాలనే ఆలోచనలో నన్ను చంపేసింది, కానీ మీ ఆత్మగౌరవంతో రాజీపడి జీవించడం వల్ల ఉపయోగం ఏమిటి” అని హిందీలో ఒక లేఖను రెజ్లర్‌ సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. ‘ఒక్కసారి కూడా’ తమ గురించి ప్రధాని అడగకపోవడం పట్ల మల్లయోధులు కూడా విస్తుపోయామన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవడం అటుంచితే.. మిరుమిట్లు గొలిపే తెల్లని దుస్తులతో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో ఉన్నారని.. నేనే వ్యవస్థ అని చెబుతున్నట్లుగా ఈ తెలుపు మమ్మల్ని కుట్టిందని ఆ లేఖలో తెలిపారు.

Exit mobile version