ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
Health Department: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ శాఖలో ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్

Ap Govt