కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలు నిరసనల్లో పాల్గొన్నారు. సినీ దర్శకురాలు అపర్ణా సేన్‌తో సహా బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వేలాది మంది ప్రజలతో కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేపడుతుంది.
AP Govt: గిరిజన ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలను ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి..
మహామిచ్చిల్లో నిరసనలు చేపట్టగా.. నగరంలో మరో రెండు ర్యాలీలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. వాటిలో ఒకటి రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న విద్యా సంస్థ పూర్వ విద్యార్థులు నిర్వహించారు. మరొకటి.. కాన్వెంట్ పాఠశాలల విద్యార్థులు నిర్వహించారు. కాలేజ్ స్ట్రీట్ నుండి బయలుదేరిన మెగా ర్యాలీలో స్వస్తిక ముఖర్జీ, సుదీప్త చక్రవర్తి, చైతీ ఘోషల్ మరియు సోహిని సర్కార్.. ఇతర నటులు, నటీమణులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న దర్శకురాలు, నటి అపర్ణా సేన్ మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో న్యాయం చేయాలని కోరుతూ వీధుల్లో ర్యాలీ నిర్వహించామన్నారు. న్యాయం చేయకపోతే.. మళ్లీ ఉద్యమిస్తామని చెప్పారు. ఈ ఘటనపై నిజం తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు పూర్తి హక్కు ఉంటుంది.. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. దర్యాప్తుపై తాము ఆశాజనకంగా ఉన్నామని పేర్కొన్నారు.
Chandrababu- Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్..
ఈ ఘటనపై స్వస్తికా ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. “ఆగస్టు 9 సంఘటన జరిగింది. ఇప్పటికీ చాలా రోజులు గడిచాయి. ఒక్క అరెస్టు తర్వాత, దర్యాప్తు సంస్థ నుండి మాకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఆసుపత్రి యాజమాన్యం ఈ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించే ప్రయత్నం చేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే అరెస్టు చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు వారి ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు.” అని తెలిపారు. ఈ ర్యాలీలో జూనియర్ డాక్టర్ల ఫోరమ్ కూడా పాల్గొని నిరసనలు చేపట్టింది. దక్షిణ కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్ స్కూల్, ఇతర విద్యా సంస్థల పూర్వ.. ప్రస్తుత విద్యార్థులు గోల్‌పార్క్ నుండి రవీంద్ర సదన్ ఎక్సైడ్ క్రాసింగ్ వరకు కవాతు నిర్వహించారు. సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ మాజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా మార్చ్ నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి చెందిన మహిళా సభ్యులు రేపిస్టులకు మరణశిక్ష విధించేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతూ వివిధ బ్లాక్‌ల వద్ద నిరసన తెలిపారు. మరోవైపు.. ఎస్ప్లానేడ్‌లోని డోరినా క్రాసింగ్ వద్ద ఆగస్టు 29 నుంచి బీజేపీ నిరసనలు చేస్తోంది.