Site icon NTV Telugu

TFCC: ఫిలిం ఛాంబర్‌పై ‘ప్రోగ్రెసివ్’ జెండా!

Progressive Panel Victory

Progressive Panel Victory

TFCC: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉత్కంఠకు తెరదించుతూ ముగిశాయి. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వర్గానికే దక్కనున్నాయి.

READ ALSO: Maruti eVX vs Hyundai Creta EV.. రేంజ్, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?

సెక్టార్ల వారీగా ఫలితాలు ఇవే..
ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో స్పష్టంగా కనిపించింది. ఇక్కడ గెలిచిన వారిలో ఏకంగా 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులే కావడం విశేషం. మన ప్యానెల్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో 12 ఈసీ మెంబర్లకు గానూ 8 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి విజయం సాధించగా, మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపొందారు, ఒక స్థానంలో ఫలితం టై అయింది.

నిర్మాతల (ప్రొడ్యూసర్స్) విభాగంలో మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు విజయం సాధించారు. స్టూడియో సెక్టార్‌లో మన ప్యానెల్ వారు ముగ్గురు, ప్రొగ్రెసివ్ ఒక్కరు గెలుపొందారు.

ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కే.. ఛాంబర్ పీఠం
మొత్తంగా ఈ ఫలితాలను విశ్లేషిస్తే మెజారిటీ ఈసీ సభ్యుల మద్దతు ఉండటంతో ఛాంబర్ పీఠం దక్కించుకోవడం ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు లాంఛనమే కానుంది. అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్షుడు, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ వర్గానికి చెందిన సభ్యులే దక్కించుకోనున్నారు. ఈ కొత్త కార్యవర్గం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ ALSO: Shiva Raj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి

Exit mobile version