NTV Telugu Site icon

RRR: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి.. టెండర్స్ పిలిచిన కేంద్రం

Rrr

Rrr

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది. రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు.. రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు.. ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు.. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు.. మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది.

Read Also: Nagarjunasagar Dam: తెలంగాణ స్పెషల్ ఫోర్స్ చేతుల్లోకి నాగార్జునసాగర్ డ్యాం భద్రత..

హైదరాబాద్ నగరం, తెలంగాణను మరింత అభివృద్ధి చేయడానికి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు సర్కార్ సన్నద్ధమైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కి.మీ దూరం నుంచి ఈ ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి- తూప్రాన్- గజ్వేల్- చౌటుప్పల్‌ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగాన్ని మొత్తం ఆరు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ఇందుకు 1,940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు గుర్తించారు. ఇందులో 72.35 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి.

Read Also: SIKANDAR Teaser: సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు.. సికందర్‌ చిత్ర బృందం స్పెషల్ గిఫ్ట్

Show comments