Site icon NTV Telugu

Prof. Kodandaram : తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీపై దీక్ష

Kodandaram

Kodandaram

విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఫ్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్య పై 150 మందితో జంతర్ మంతర్ వద్ద ఒక గంటపాటు మౌన దీక్ష చేపట్టామన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ పై దీక్ష చేపట్టామని, కృష్ణ జలాల్లో మన రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదు. న్యాయమైన వాటా రాలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసిన రాష్ట్రం సాధించుకున్నా.. 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నీటి పంపకం జరగలేదన్నారు. కృష్ణా జలాల తీర ప్రాంతం 78 శాతం తెలంగాణలో ఉందని, కానీ తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే ఇచ్చారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల వాటా 899 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ కృష్ణాజిల్లాల వాటా కేవలం 29 శాతమేనని ఆయన మండిపడ్డారు.

Also Read : Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్

ప్రస్తుతం తెలంగాణలో వరద జలాల పైన ఆధారపడి ప్రాజెక్టులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 28 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఆగిపోయిందని, ట్రిబ్యునల్ వేసి రాష్ట్ర వాటా తేల్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అన్యాయం జరుగుతోందని, తమ కేసులను నుంచి కాపాడుకునేందుకు మాత్రం ఢిల్లీకి వస్తారని, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేయరని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సమస్యలపై మెమోరాండం ఇస్తామని, రేపు 31న కాన్సిట్యూషన్ క్లబ్ కేసీఆర్ పాలనపై సెమినార్ కార్యక్రమం అని, విభజన చట్టంలో 10వ షెడ్యూల్ లే ఉన్న 93,94,95 ప్రకటనలు చాలా కీలకమైనవని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలు చాలా కీలకమైనవి.

Also Read : Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్

9 సంవత్సరాల కాలంలో వాటిపై దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రప్రభుత్వాలు అడగలేదు, కేంద్రం పట్టించుకోక పోవడంతో అవి పరిష్కారం కాలేదని, విభజన చట్టంలో ఉన్న అంశాలను సాధించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. తెలంగాణ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రజాబాహుళ్యంలోకి వెళ్లి ఆందోళన చేపట్టాలని నిర్ణయించామన్నారు.

Exit mobile version