Site icon NTV Telugu

Vijjulatha : తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు స్వీకరించిన విజ్జులత

Vijjulatha

Vijjulatha

తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రస్తుత కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. విజ్జులత బాధ్యతలు స్వీకరించారు. కోఠిలో ఉన్న కళాశాల ఆవరణలోని దర్బార్ హల్ జరిగిన కార్యక్రమంలో… ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య దండెపోయిన రవీందర్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. అంతకు ముందు కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు కవాతుతో పాటు… పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ఆచార్య ఎం. విజ్జుల్లత నియామకం ప‌ట్ల… ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఆచార్య దండెబోయిన రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read : Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే

ప్రతిష్ఠాత్మక మహిళా విశ్వ విద్యాలయానికి సీనియర్ ఆచార్యులు, దళిత మహిళకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య విజ్జుల్లత నేతృత్వంలో మహిళా విశ్వవిద్యాలయం అన్నివిధాలుగా పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆచార్య ఎం. విజ్జుల్లత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేశారని… బోధన విధులతో పాటు పలు పరిపాలనపరమైన పదవులు నిర్వహించారని తెలిపారు.

Also Read : Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే

ఆమె యూజీసీ వ్యవహారాల డీన్‌గా, కోఠీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా… కోఠీ మహిళా కళాశాల ప్రాంగాణాన్నే విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఆ విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా నియమితులైన ఆచార్య విజ్జులత కూడ కోఠీ కళాశాల పూర్వవిద్యార్థే కావడం గమనార్హమన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిసిన విజ్జులత… సమర్థవంతంగా నిర్వహించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Exit mobile version