NTV Telugu Site icon

Production No2: హీరోయిన్ గా దృశ్యం పాప రెండో సినిమా.. ఏకంగా ప్రొడ్యూసర్ కొడుకుతో..!

Whatsapp Image 2024 04 03 At 12.52.49 Pm

Whatsapp Image 2024 04 03 At 12.52.49 Pm

దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఇదివరకు ‘జోహార్’ అనే ఒక సినిమా చేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవ్ లగడపాటితో సినిమా చేస్తోంది. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత త్రినాథరావు నక్కిన తన నిర్మాణ పనుల్లో బిజీ అయిపోయాడు. తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్ ప్రొడక్షన్ నెం 2ని ప్రకటించాడు. దానికి అతను కథను కూడా రాశాడు. ఈరోజు పూజా ముహూర్తంతో సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

Also Read: Baby Girl Adoption: తాము ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకోండి అంటున్న జంట..!

ఇక ఈ సినిమాకు వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లే అందించనున్నారు. బ్లాక్‌బస్టర్ ‘సినిమా చూపిస్త మావ’ తర్వాత.., విక్రమ్ సహిదేవ్ లగడపాటి ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ కొత్త సినిమా కోసం త్రినాధ రావు నక్కిన మరో ఆకర్షణీయమైన కథను రాశారు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. త్రినాథరావు, నాయుడు స్క్రిప్ట్ అందించగా, సందీప్ కిషన్ క్లాప్ బోర్డు ను కొట్టగా.. శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. ఇక నేటి కార్యక్రమంలో తొలి షాటికి సుమంత్ దర్శకత్వం వహించారు.

Also Read: AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!

ఈ సినిమా మొత్తం ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ కథానాయికగా నటిస్తుండగా.., తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాకు దావంద్ సంగీతాన్ని అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిట్ చేయనున్నారు.

Show comments