NTV Telugu Site icon

Kedar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సినీ నిర్మాత కేదార్ మృతి..

Kedar

Kedar

తెలంగాణ రాజకీయాల్లో నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. దుబాయ్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు. మూడు రోజులైన మృతదేహం ఇంకా దుబాయ్‌లోనే ఉంది. దర్యాప్తు పూర్తయితేనే హైదరాబాద్‌కు మృతదేహాన్ని పంపనున్నారు. ర్యాడిసన్ డ్రగ్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు దుబాయ్‌లో పెట్టుబడులు, ఆస్తులు కొనిపెట్టడంలో మధ్య వర్తిగా కేదార్ ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు కేదార్ సన్నిహితుడిగా ఉన్నారు. ప్రస్తుతం షకీల్ దుబాయ్‌లోనే ఉన్నారు. కేదార్ మృతి అనంతరం షకీల్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరికీ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం ఓ శుభకార్యానికి హాజరైన కేదార్‌.. ఆదివారం భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించారు. సోమవారం సినీరంగ ప్రముఖులతో జరిగిన విందులో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో తన ఫోన్‌ను వంటమనిషికి అందజేసి.. ‘‘11 గంటలకు మీటింగ్‌ ఉంది. అప్పటి వరకు నన్ను లేపొద్దు. ఒకవేళ కుటుంబ సభ్యులు మాత్రమే ఫోన్ చేస్తే లేపు’’ ఓ వ్యక్తి నుంచి వరుసగా ఫోన్లు రావడంతోటి వంట మనిషి కేదార్‌ను లేపేందుకు ప్రయత్నించగా.. విగతజీవిగా కనిపించారు. సమాచారం అందుకుని, కేదార్‌ ఇంటికి వచ్చిన దుబాయ్‌ పోలీసులు వంటమనిషి సహా.. నలుగురిని విచారించారు. వారిలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే తాను దుబాయ్‌కి వెళ్ల లేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఇకా దుబాయ్‌లో పోస్టు మార్టం చాలా రోజులు కొనసాగుతోంది. 3-7 రోజులు నిర్వహిస్తారు. అనంతరం రిపోర్టు ఇస్తారు. ఇది అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ.. గుండెపోటుతో మరణించినట్లు దుబాయ్ అధికారులు ప్రాథమికంగా తెలిపారు. మూడు రోజులు గడుస్తున్న బాడీని ఇవ్వకపోవడంపై కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిన్న సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా జరుగుతున్న మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ కేదార్ కేసును దుబాయ్ దర్యాప్తు చేస్తున్నారు. వారే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.