విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం”. ఇందులోమీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేశారు. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ సినిమా మంచి లాభాలు కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి దాదాపు 300 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది.
READ MORE: Honda City Apex Edition: మార్కెట్ లోకి హోండా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్.. ధర ఎంతంటే?
తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విజయం తనకు పాఠం నేర్పిందన్నారు. కాంబినేషన్ చిత్రాలంటూ నాలుగైదేళ్లుగా తడబడుతున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో మళ్లీ తామ దారిలోకి వచ్చామన్నారు. తమ బ్యానర్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆరు చిత్రాలు చేసినట్లు వెల్లడించారు. కథల విషయంలో చర్చించుకోమన్నారు. ఆయన విషయంలో ఎప్పుడూ ఒత్తిడి ఫీలవ్వలేదన్నారు. పడిపోతున్న మమ్మల్ని ఈ సినిమాతో అనిల్ పైకి తీసుకొచ్చాడని కొనియాడారు. కొవిడ్ నుంచి గతుకురోడ్డుపై ప్రయాణిస్తున్న వాళ్లని తారు రోడెక్కించాడన్నారు. పదేళ్ల తమకు ఎలాంటి డోకా లేదని.. విజయాలు తమ సొంతమని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ కాదు కథే ముఖ్యమని నిర్మాత స్పష్టం చేశారు.
READ MORE: Budget 2025: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. TDS పరిమితి పెంపు, NSSకు మినహాయింపు..
కాగా.. నిజానికి దిల్ రాజు నిర్మాతగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా హక్కులతో పాటే ఈ సంక్రాంతికి వస్తున్నాం హక్కుల్ని కూడా అమ్మారు. అయితే గేమ్ చేంజెర్ సినిమా నిరాశపరిచిన సరే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి లాభాలు కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి దాదాపు 300 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది.