Site icon NTV Telugu

TheRajaSaab : వామ్మో రాజాసాబ్ రన్ టైమ్.. సీక్వెల్ కూడా ఉందా?

Theraajasaab

Theraajasaab

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.

Also Read : The RajaSaab : సంక్రాంతికి రాజాసాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న రాజాసాబ్ సాంగ్స్ షూట్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ రాజాసాబ్ రన్ టైమ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వ ప్రసాద్’ రాజాసాబ్ షూట్ అక్టోబర్ కు ఫినిష్ అవుతుంది. మొత్తం ఈ సినిమా నాలుగున్నర గంటల ఫ్యూటేజ్ వస్తుంది. దాన్ని ఎడిట్ చేసి అక్కడడక్కడ మ్యాచ్ చేసి మూడు గంటలు లేదా 2: 45 గంటలు అనేది డైరెక్టర్ కాల్. ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే సాంగ్స్, కామెడీ, మాస్, స్టోరీ, విజువల్ గ్రాండియర్ అన్ని ఉంటాయి. ప్రభాస్ నుండి బెస్ట్ హారర్ కామెడీ సినిమా రాబోతుంది’ అని అన్నారు.

రాజసాబ్ సీక్వెల్: అలాగే రాజాసాబ్ సీక్వెల్ పై కూడా విశ్వ ప్రసాద మాట్లాడుతూ’ రాజాసాబ్ 2 ఖచ్చితంగా ఉంది. కానీ ఆ కథ రాజాసాబ్ కు సంబంధం ఉండదు. ఈ స్టోరీ కంటిన్యూ అవదు. మల్టివర్స్ టైప్ లో రాజా సాబ్ ఫ్రాంచైజ్ లో భారీ స్కేల్ లో గ్రాండియర్ గా ఉంటుంది అని చెప్పారు.

Exit mobile version