Site icon NTV Telugu

Producer Anji Reddy : ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య

New Project (36)

New Project (36)

Producer Anji Reddy : తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్థిరాస్తుల వ్యవహారంలో జిఅర్ కన్వెన్షన్స్ యజమాని రవి కాట్రగడ్డ.. నిర్మాత అంజిరెడ్డి ని హత్య చేశాడు. డీమార్ట్ బెస్ మెట్ 2 సెల్లార్ పార్కింగ్ లో ఇద్దరు బీహారీలతో కలిసి నిర్మాత అంజిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. నిర్మాత పేరుతో పలు భవనాలను ధ్వంసం చేసేందుకే రవి కాట్రగడ్డ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.

Read Also:Election Commission: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఎలక్షన్ కమీషన్ ఓటర్ అవేర్నెస్ కంపెయిన్

తన ఆస్తులను అమ్మి అమెరికా వెళ్లాలని భావించిన నిర్మాత అంజిరెడ్డి, రవికి ఆస్తులు అమ్మే బాధ్యతను అప్పగించారు. ఈ తరుణంలో రవి కాట్రగడ్డ ఆస్తులన్నీ తన పేరు మీద రాసి నిర్మాతను హత్య చేశాడు. రవి కాట్రగడ్డ ఇద్దరు బీహారీలకు సుపారీ ఇచ్చి హత్య చేశాడు. అయితే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు… అసలు విషయం తెలుసుకుని కాట్రగడ్డ రవిని అరెస్ట్ చేశారు.

Read Also:Uorfi Javed Engagaed: సీక్రెట్‎గా నిశ్చితార్థం చేసుకున్న ఉర్ఫీ జావేద్.. ఆందోళనలో ఫ్యాన్స్

Exit mobile version