Pro-Khalistan: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో ఇవాళ ఉదయం సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్ దగ్గర కొందరు వ్యక్తులు ఖలిస్తాన్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పోస్టర్‌లను ప్రదర్శించారు. దీంతో పాటు అక్కడ ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కూడా చేశారు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా సిక్కు వర్గానికి చెందిన కొందరు ఈ నినాదాలు చేస్తూ పోస్టర్లు వేశారు. భింద్రన్‌వాలే జయంతి సందర్భంగా రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అనేక సిక్కు సంస్థలు కూడా ఈ సాయంత్రమే ఖల్సా మార్చ్‌ను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అలాగే, అనేక సంస్థలు ఈ రోజు అమృత్‌సర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అమృత్‌సర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Also: Alia Bhatt: హాలీవుడ్ సినిమా చేయడానికి కారణం అదే: అలియా
కాగా, పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో తమ సిబ్బంది సెలవులను పోలీస్ శాఖ రద్దు చేశారు. పంజాబ్ పోలీసుల శిక్షణా కేంద్రాల నుంచి 2000 మంది పోలీసులను అమృత్‌సర్‌కు రప్పించారు. ఇది కాకుండా, సరిహద్దు జిల్లాలైన అమృత్‌సర్ దేహతి, తరన్ తరణ్, బటాలా, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ నుంచి కూడా అదనపు పోలీసు బలగాలను అమృత్‌సర్‌కు పిలిపించారు. స్వర్ణ దేవాలయానికి వెళ్లే రహదారులపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. వాస్తవానికి, ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం సందర్భంగా నినాదాలు చేయడం వల్ల అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Sai Pallavi: మరో ప్రేమ కథలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?
దీంతో SGPC టాస్క్‌ఫోర్స్‌తో పాటు విధులు నిర్వర్తించే శ్రీ హర్మందిర్ సాహిబ్ పరిక్రమ, శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ చుట్టూ సిక్కు పోలీసు సిబ్బంది సివిల్ డ్రెస్‌లో మోహరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. ఇది కాకుండా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడు బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా కూడా ఫరీద్‌కోట్ స్థానం నుంచి గెలిచారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో వర్గ రాజకీయాలకు దారి తీస్తుందనిపోలీసులు భావిస్తున్నారు.
Read Also: AP Election Results: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాలకు ఎదురుదెబ్బ
ఇక, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటువాదులు ప్రత్యేక పంజాబ్‌ను డిమాండ్ చేస్తూ స్వర్ణ దేవాలయంలో ఆశ్రయం పొంది అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయం నుంచి వేర్పాటువాదులను తరిమికొట్టేందుకు 1984 జూన్ 1 నుంచి జూన్ 6 వరకు కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య చేపట్టాల్సి వచ్చింది. జూన్ 6న స్వర్ణ దేవాలయంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ నిర్వహించి పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.