NTV Telugu Site icon

Cricket: 6 బంతుల్లో 6 సిక్సులు బాదిన క్రికెటర్.. జూనియర్ యువరాజ్ ఎవరో తెలుసా..?

Priyansh Arya

Priyansh Arya

మళ్లీ యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడు ఈ బ్యాట్స్ మెన్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (డీపీఎల్ 2024)లో 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. దీంతో.. మరోసారి యువరాజ్ సింగ్ ను గుర్తు చేసుకునేలా చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య.. నార్త్ ఢిల్లీ బౌలర్ మానన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు.

Japan: జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు

ఆకాశమే హద్దుగా చెలరేగి సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో.. ప్రియాంష్ ఆర్య సెంచరీ కూడా చేశాడు. ప్రియాంష్ (120), ఆయుష్ బదోని (165) పరుగులు చేశాడు. దీంతో.. సౌత్ ఢిల్లీ జట్టు 308 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ ఢిల్లీ జట్టుకు 309 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా.. ప్రియాంష్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం అతని తుఫాన్ ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్‌మెన్స్

ఇదిలా ఉంటే.. మరో బ్యాటర్ ఆయుష్ బదోని చెలరేగాడు. అతను 55 బంతుల్లో 19 సిక్సర్లు, 8 ఫోర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. టీ 20ల్లో ఇదే అత్యధిక స్కరు. మరోవైపు.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఇప్పటి వరకు అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో సౌత్ ఢిల్లీ జట్టు 5 మ్యాచ్ లు గెలుపొందగా, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టు 7 మ్యాచ్‌లు ఆడి 6 గెలిచి 1 ఓటమితో 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.

Show comments