NTV Telugu Site icon

Priyanka Gandhi: రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్న ప్రియాంక గాంధీ

Priynaka Gandi

Priynaka Gandi

Priyanka Gandhi: కేరళలోని వాయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్‌ 3 నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 3న ప్రియాంక గాంధీ తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన గురించి శుక్రవారం సమాచారం ఇస్తూ.. నవంబర్ 7 వరకు కేరళలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంతో పాటు కార్యకర్తలతోనూ సంభాషించనున్నారు.

Read Also: Pappu Yadav: ఎవరు చంపాలనుకుంటున్నారో.. వచ్చి నన్ను చంపేయండి

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి నవంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు మనంతవాడిలోని గాంధీ పార్కులో ర్యాలీకి హాజరవుతారు. ఈ ర్యాలీతో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ర్యాలీ అనంతరం ఆమె అదే రోజు మరో మూడు చోట్ల వేర్వేరుగా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. పార్టీ ప్రకటన ప్రకారం తన సోదరి ప్రియాంకతో కలిసి ఉమ్మడి ర్యాలీతో పాటు రాహుల్ గాంధీ RICలో ప్రతిపాదించిన మరో ర్యాలీలో ప్రసంగిస్తారు.

Read Also: Nara Bhuvaneswari: రామ్ సినిమా రంగంలోకి వస్తునందుకు థ్రిల్లింగ్ గా ఉంది

నవంబర్ 4న కల్పేట, సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఐదు చోట్ల ప్రియాంక సభలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. నవంబర్ 5, 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

Show comments