Site icon NTV Telugu

Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్తకు ఊహించని ఘటన.. డేంజర్‌లో ఉన్నాడా?

Priyanka Chopra, Nick

Priyanka Chopra, Nick

Priyanka Chopra’s Husband Nick Jonas News: బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా భర్త, అమెరికా పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో సోదరులు జో, కెవిన్‌లతో కలిసి నిక్‌ కాన్సర్ట్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై లేజర్‌ లైట్‌ వేశాడు. దాంతో కంగారు పడిపోయిన నిక్‌.. షోను మధ్యలోనే ఆపేసి వేదిక నుండి బయటికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై నిక్‌ జొనాస్‌ తన భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. నిక్‌ మీద లేజర్‌ వేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది గుర్తించి.. అతడిని వెంటనే షో నుంచి పంపించి వేశారట. నిక్‌ వేదిక నుండి కిందకు రాగా.. అతడి సోదరులు కెవిన్, జో మాత్రం వేదికపైనే ఉండడం విశేషం. ఈ ఘటనతో కార్యక్రమాన్ని కొంతసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిక్‌ ఏదైనా డేంజర్‌లో ఉన్నాడా? అని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Suhasini: రజనీ-మణిరత్నం కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని!

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే 2017లో ‘బేవాచ్‌’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో నిక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు.. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ముంబైకి బై చెప్పిన ప్రియాంక.. లాస్‌ ఏంజెలిస్‌లో సెటిల్‌ అయ్యారు. హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రియాంక-నిక్‌ జంటకు 2022 జనవరి 15న కూతురు మాల్తీ జన్మించారు.

Exit mobile version