Site icon NTV Telugu

Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Priyanka Chopraa

Priyanka Chopraa

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది.. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ తనకు అన్యాయం చేసిందని తిట్టి పోస్తూనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం అరాచకం.. తాజాగా ప్రియాంక ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.. ఈ ఈవెంట్ కు తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది..

ఈవెంట్ లో లేత గులాబీ రంగు డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.. అంతేకాదు ఆమె ధరించిన స్పెషల్ నెక్లేస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఎంతో సింపుల్ గా కనిపించే దాని ధర విని నెటిజన్లు, ఫ్యాన్స్ విని షాక్ అవుతున్నారు.. ప్రముఖ కంపెనీ దాన్ని డిజైన్ చేశారు.. దాని ధర రూ. 8.33 కోట్లు ఉంటుందని అంచనా.. ఇక కేరీర్ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ‘ది బ్లఫ్‌’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది.. హాలివుడ్ లో వెబ్ సిరీస్ లతో పాటుగా సినిమాలు కూడా చేస్తుంది..

Exit mobile version