NTV Telugu Site icon

Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Priyamla

Priyamla

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా బిజీగా ఉంది.. బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు..

ఈ అమ్మడు హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు ముంబైకు వచ్చి వెళ్తుంది. తాజాగా బల్గారి తన 140వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.. పలువురు ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. అందులో ప్రియాంక చోప్రా కూడా ఉంది.. ఈ ఈవెంట్ కు ప్రియాంక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో మెరిసింది.. ఆ డ్రెస్స్ తో పాటుగా ఆమె వేసుకున్న నెక్లేస్ అందరిని ఆకట్టుకుంది.. దాని ధర కోసం ఆమె ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు.

ఈవెంట్ లో ఆ డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.. అంతేకాదు ఆమె ధరించిన స్పెషల్ నెక్లేస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.. సింపుల్ గా కనిపించే దాని ధర విని నెటిజన్లు, ఫ్యాన్స్ విని షాక్ అవుతున్నారు.. సెర్పెంటి ఎర్టెనా నెక్లెస్‌ ను ప్రియాంక ధరించింది.. 200 క్యారెట్ల వజ్రంతో దాన్ని తయారు చేశారు. 698 అన్‌లులేటింగ్ బాగెట్-కట్ డైమండ్స్‌తో అలంకరించబడింది.. దీన్ని తయారు చెయ్యడానికి దాదాపు 2800 గంటలు పట్టినట్లు తెలుస్తుంది.. ఇక దీని ధర రూ. 358 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ధరతో రెండు భారీ సినిమాలు చెయ్యొచ్చు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఆ నెక్లేస్ పై ఓ లుక్ వేసుకోండి..