Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!

Priyanka Chopra

Priyanka Chopra

ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. కానీ ఆమె బాలీవుడ్‌ని వదిలి హాలీవుడ్‌కు వెళ్లడం వెనుక పెద్ద కథే ఉందని తాజాగా ఆమె వెల్లడించింది. తన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ (The Bluff) ఫిబ్రవరి 25న విడుదలవుతున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Also Read: Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్!

ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని అనుకోలేదు. కానీ అప్పట్లో హిందీ ఇండస్ట్రీలో నాపై ఉన్న రాజకీయాల వల్ల నన్ను ఒక మూలకు నెట్టేశారు. నాకు రావాల్సిన అవకాశాలను కావాలనే తగ్గించేశారు. నటిగా ఎదగాలని ఉన్నా సరే, అక్కడ పరిస్థితులు నాకు సహకరించలేదు. అలాంటి టైమ్‌లో హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ నాకు ఒక దారి చూపించింది’ అని తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది.

ప్రియాంక హాలీవుడ్‌కి వెళ్లి దాదాపు 12 ఏళ్లు దాటింది. ఇప్పుడు అక్కడ స్టార్‌గా ఎదిగిన తర్వాత మళ్ళీ ఇండియాకు రావడంపై ఆమె స్పందిస్తూ.. ‘నేను మళ్ళీ ఇండియన్ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ (Varanasi) సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమాల మేకింగ్, అక్కడి కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు హాలీవుడ్, బాలీవుడ్ రెండూ రెండు కళ్లలాంటివి. ఒక దాన్ని వదిలి ఇంకో దాన్ని ఎంచుకోలేను’ అని క్లారిటీ ఇచ్చింది.