NTV Telugu Site icon

Dhoni First Production: ధోని ఫస్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది

Priyanka Arul Mohan

Priyanka Arul Mohan

Dhoni First Production: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగం లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ ఎంటర్ టైన్మెంట్ అంటూ తన బ్యానర్ ను ప్రకటించారు. తన తొలి ప్రొడక్షన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు రమేష్ తమిళమణి ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.దీపావళి పండుగను పురస్కరించుకొని దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోని-తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు.

Read Also: Telugu Movie Sequels : తెలుగులో సీక్వెల్స్ హవా.. మార్కెట్ ఎన్ని కోట్లంటే

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ నుండి రావాల్సి ఉంది. తొలి ప్రాజెక్టును భారతదేశంలోని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చేరనున్నారు. ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: Actress Prema: ఆయనంటే చాలా భయం.. వామ్మో డైరెక్ట్‎గా చూడటమే

ప్రియాంకా అరుళ్‌ మోహన్, నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019)చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా వ‌స్తున్న డాక్టర్ సినిమా, డాన్ సినిమాల్లో నటిస్తుంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించనుంది. ప్రియాంక.. మహేష్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమాలో నటించనుంది.