Priyamani : షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటమ్ సాంగ్ చేశాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా తర్వాత అలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయాల్సిందిగా తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా తాను తిరస్కరించానని, కేవలం షారుక్ కోసమే ఆ పాట చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.
చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో 1234 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అనే పాటలో ప్రియమణి.. షారుక్ ఖాన్ తో చిందులేసింది. “షారుక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ద్వేషించే వాళ్లు ఉండొచ్చు. కానీ అతన్ని ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను కలిసిన మంచి మనసున్న వాళ్లలో షారుక్ ఖాన్ ఒకరు. ఆయన మహిళలతోనే కాదు అందరితోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటారు.. ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలో నేను ఆయన నుంచే నేర్చుకున్నాను” అని ప్రియమణి చెప్పింది.”షారుక్ తో చెన్నై ఎక్స్‌ప్రెస్ రోజుల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా డ్యాన్స్ ఎక్కడో చూసి రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ తమను కలవడానికి రమ్మని పిలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని ప్రియమణి తెలిపింది. ఆ తర్వాత కూడా గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో నటించింది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!