NTV Telugu Site icon

CM Priyamani : ముఖ్యమంత్రి రేసులో హీరోయిన్ ప్రియమణి.. ఆల్ ది బెస్ట్ అంటున్న అభిమానులు

Priyamani Facts 1280x720

Priyamani Facts 1280x720

CM Priyamani : తమిళంలో పరుత్తి వీరన్ సినిమాలో ముత్తళగి పాత్రలో గ్రామీణ యువతిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రియమణి. తర్వాత తమిళంతో పాటు తెలుగు, హిందీ తదితర భాషా చిత్రాల్లో నటించి మెప్పించారు. వివాహానంతరం హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు ప్రియమణి. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Also: Alia Bhatt: ఆస్పత్రిలో చేరిన ఆలియా భట్.. ఆందోళనలో ఫ్యాన్స్

తెలుగులో వచ్చిన నారప్ప చిత్రంలో వెంకటేశ్ కు జంటగా విభిన్న పాత్రలో జీవించేశారు. తాజాగా యువ నటుడు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ద్విభాషా చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దీని ద్వారానే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక మహిళ సీఎం అయితే ఎలాంటి పనులు చేయగలుగుతారు అన్నది కథ.

Show comments