Site icon NTV Telugu

Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి!

Priyamani

Priyamani

దక్షిణాది సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. ఒక ప్రతిష్టాత్మక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌లో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు.

Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో!

బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ప్రియమణి ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతున్నారు. హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాయి. భారతీయ, అమెరికన్ సంస్కృతుల కలయికతో, ఒక వలస కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగపూరిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ప్రియమణి తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోబోతుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version