Site icon NTV Telugu

Bhamakalapam 2 : ప్రియమణి ‘ భామా కలాపం మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్..24 గంటల్లోనే..

Whatsapp Image 2024 02 17 At 10.12.44 Pm

Whatsapp Image 2024 02 17 At 10.12.44 Pm

ప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.భామాకలాపం 2 సినిమా 24 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (ఫిబ్రవరి 17) ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. డేంజరస్ హౌస్ వైఫ్ రూల్ కొనసాగుతోందని వెల్లడించింది.

“ఇది ది డేంజరస్ హౌస్ వైఫ్ రూలు. భామాకలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్లు దాటాయి” అని ఆహా ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి ఆహా ఫ్లాట్ ఫామ్ జోరుగా ప్రమోషన్లను చేసింది. టీజర్ లాంచ్ సహా వివిధ కార్యక్రమాలకు ఈవెంట్లను కూడా నిర్వహించింది. మొత్తంగా మంచి హైప్ తెచ్చుకున్న భామాకలాపం 2 ఓటీటీ లో  మంచి రెస్పాన్స్ అందుకుంది.భామాకలాపం 2 మూవీలో అనుపమ అనే పాత్రలో ప్రియమణి తన పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. శిల్ప క్యారెక్టర్ చేసిన శరణ్య కూడా ఎంతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా మరియు రుద్ర ప్రతాప్ కీలకపాత్రలు పోషించారు.ఓ కోడి పుంజు ట్రోఫీ దోపిడీ, డ్రగ్స్ మాఫియా మరియు వంటల పోటీలు వంటి అంశాలతో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి భామాకలాపం 2 సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు. డ్రీమ్ ఫార్మర్స్ పతాకంపై బాపినీడు మరియు సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version