Site icon NTV Telugu

Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..

Suyodhana

Suyodhana

Suyodhana: వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం సుయోధన. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌‌పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

READ ALSO: Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

అనంతరం నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. మంచి కథతో, అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీత అందించారని, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ను అందించారని అన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతోందని వెల్లడించారు.

READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!

Exit mobile version