Site icon NTV Telugu

AP News: మాజీ మంత్రి నారాయణ వేధింపుల పర్వం.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ

Krihsna Priya

Krihsna Priya

మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పొంగూరు కృష్ణప్రియ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది. ఇప్పటికే తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రియ గళమెత్తింది. తాజాగా ఆమే ఏకంగా పోలీసులను ఆశ్రయించి.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రియ పేర్కొన్నారు. మరోవైపు ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pakistan Blast: పాకిస్తాన్‎లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

ఇంతకుముందు మాజీమంత్రి నారాయణ తనను వేధిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ప్రియ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లో భార్య ఉండగానే తనకు అన్నం పెట్టలేదంటూ తనపై చేయి చేసుకున్నారని ప్రియా తెలిపింది. అంతేకాకుండా తనపై ఆయన డేగలా కన్నేశాడని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలోనూ తనను ఇబ్బందులకు గురి చేసేవాడని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తాను 29 ఏళ్లు భరించానని.. ఇక భరించే స్తోమత లేదంటూ ప్రియా వీడియోలో తెలిపింది.

Exit mobile version