Site icon NTV Telugu

Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..

Docters Protest

Docters Protest

రాజస్థాన్ లోని ప్రైవేట్ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన ఓ మహిళ డాక్టర్ రోడ్డుపై పానీపూరి బండి పెట్టు్కుని పానీపూరి అమ్ముకుంటుంది. ప్రైవేట్ డాక్టర్ అని ఆ బండి మీద బోర్డు కూడా రాసి పెట్టుకుంది. ఆమెతో పాటు అక్కడ పని చేసే సిబ్బంది పక్కనే టీ అమ్ముకుంటూ కనిపించారు. వేలాది మంది డాక్టర్లు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు.

Also Read : Khalistani Amritpal: యూపీలో హై అలర్ట్.. అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పోస్టర్లు

అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులపై ప్రైవేట్ డాక్టర్లమని రాసి ఉంటుంది. ఆస్పత్రి యాజమాన్యం సైతం ఇలానే చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. వాస్తవానికి అక్కడ రాజస్తాన్ ప్రభుత్వం రైట్ టూ హెల్త్ అనే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి పౌరుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎక్కడైనా అత్యవసర వైద్యం పొందొచ్చు.. దీన్ని రాజస్థాన్ లోని ప్రైవేట్ హస్పటల్స్ వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేట్ డాక్టర్ల టీమ్ ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని డిమాండ్ చేస్తూ.. ఇలా విభిన్నంగా ర్యాలీలు చేపట్టారు. ఈ చట్టం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాజస్థాన్ సర్కార్ యత్నిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : PAK vs AFG : పాక్ ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్.. 7 వికెట్ల తేడాతో గెలుపు

ఇవాళ రాజస్థాన్ లోని మొత్తం వైద్య సదుపాయాలను మూసి వేసి ఇలాంటి నిరసనలే పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పైగా ఈ నెల 29న దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి వైద్యుల బృందాలు ఈ నిరసన కోసం రాజస్థాన్ కు వస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే తనను కలవాలని వైద్యులకు చెప్పినా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.. అలాగే ఆదివారం మీడియా ద్వారా ప్రభుత్వం వైద్యులందరిని విధుల్లోకి రావాల్సిందిగ తెలిపింది. అందుకు కూడా వైద్యులు ప్రతిస్పందించలేదు.. దీంతో ప్రభుత్వం ఈ నిరసనలను అణిచివేసేందుకు సన్నహాలు ప్రారంభించినట్లు అధికారిక వర్గాల సమచారం.

Exit mobile version