పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా లో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్,పృథ్విరాజ్ స్నేహమే ప్రధాన అంశంగా సలార్ పార్ట్-1 రూపొందినట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం సలార్ క్రేజ్ పీక్స్‌లో ఉంది. సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ క్రమంగా ప్రమోషన్ల జోరును పెంచుతోంది. ఈ క్రమంలోనే పృథ్విరాజ్ సుకుమారన్ హెచ్‍టీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్రభాస్‍ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తనకు సలార్ సమయంలో నే అర్థమైందని పృథ్విరాజ్ వెల్లడించారు. అతడికి చాలా త్వరగా స్నేహితుడినయ్యాయనని ఆయన వివరించారు. “ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ ప్రభాస్ కి ఉంది. సెట్‍లో ఎప్పుడూ అందరి గురించి ప్రభాస్ చూసుకుంటుంటారు. అందరూ మంచి ఆహారం తినేలా.. సౌకర్యవంతంగా ఉండేలా ప్రభాస్ చూసుకుంటుంటారు. అప్పుడు తెలిసింది ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని ఎందుకు అంటారో” అని పృథ్విరాజ్ తెలిపారు.. తాను తరచూ మెసేజ్‍లు చేసే అతి తక్కువ స్నేహితుల్లో ప్రభాస్ ఒకరని ఆయన తెలిపారు.
కేజీఎఫ్ 2 సమయంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకు సలార్ కథ చెప్పారని పృథ్విరాజ్ సుకుమారన్ తెలిపారు. ఇటీవలి కాలంలో తాను విన్న గొప్ప స్క్రిప్ట్ ఇదే అనిపించిందనిఆయన అన్నారు. తనను వరదరాజగా ప్రశాంత్ ఊహించుకున్నందుకు ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఆ కథపై పెట్టుకున్న నమ్మకంతో ముందుకు సాగామని, అది ఫలించిందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పృథ్విరాజ్ తెలిపారు.ఇదిలా ఉంటే సలార్ సినిమా ప్రమోషన్ల జోరు క్రమంగా పెరుగుతోంది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍ను దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ అతి త్వరలో బయటికి రానుంది. ఇటీవల సలార్ నుంచి రిలీజ్ చేసిన “సూరిడే”సాంగ్ సూపర్ పాపులర్ అయింది. అలాగే సెన్సార్ రిపోర్టులు కూడా సలార్‌కు పాజిటివ్‍గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న సలార్ విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి