Mollywood : మళ్లీ సొంత ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇతర ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కారణంగా మాలీవుడ్ పై తన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గించిన పృధ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ కేరళ ఆడియన్స్ పలకరించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : Ram Charan : వెనకబడిన రామ్ చరణ్.. అదే రీజన్ కావొచ్చు
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ద గోట్ లైఫ్, గురుర్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. సొంత గూటికి కాస్త దూరంగా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ వారణాసి, దైరాతో బిజీగా ఉన్నాడు. సలార్2 కూడా లైన్లో ఉంది. ఈ పొరుగు ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్‌తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. ఈ ఏడాది సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటిస్తున్నాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంతోష్ ట్రోపీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా కూడా 2026నే ప్రేక్షకుల ముందకు రాబోతోంది. మొత్తానికి సౌత్ పోల్, ఇటు నార్త్ పోల్‌ని చుట్టేయడానికి సిద్ధమౌతున్నాడు రణ కుంభ.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!