Site icon NTV Telugu

Mollywood : మళ్లీ సొంత ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న స్టార్ హీరో

Pridhvi Raj Sukumaran

Pridhvi Raj Sukumaran

ఇతర ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కారణంగా మాలీవుడ్ పై తన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గించిన పృధ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ కేరళ ఆడియన్స్ పలకరించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : Ram Charan : వెనకబడిన రామ్ చరణ్.. అదే రీజన్ కావొచ్చు

ద గోట్ లైఫ్, గురుర్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. సొంత గూటికి కాస్త దూరంగా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ వారణాసి, దైరాతో బిజీగా ఉన్నాడు. సలార్2 కూడా లైన్లో ఉంది. ఈ పొరుగు ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్‌తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. ఈ ఏడాది సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటిస్తున్నాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంతోష్ ట్రోపీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా కూడా 2026నే ప్రేక్షకుల ముందకు రాబోతోంది. మొత్తానికి సౌత్ పోల్, ఇటు నార్త్ పోల్‌ని చుట్టేయడానికి సిద్ధమౌతున్నాడు రణ కుంభ.

 

Exit mobile version