Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..

Sdkdkkdk

Sdkdkkdk

భారత క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ వివాహానికి ముందే విడిపోయారు.సుమారు ఆరు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్ చేసుకొని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట, తాజాగా తాము విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ఒక పోస్ట్ పెట్టడం ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు.

భవిష్యత్తు పట్ల తమ ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించిన తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు, బాధ్యతలరీత్యా తమ జీవిత మార్గాలు వేర్వేరుగా ఉండాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఇప్పటికీ గౌరవం ఉందని స్పష్టం చేశారు.

తాము ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకృతి తెలిపారు. అలాగే ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, తమ నిర్ణయానికి దారితీసిన కారణాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ అనూహ్య పరిణామంతో వివాహం జరగకుండానే పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ల నిశ్చితార్థ బంధం ఆరు నెలలకే ముగిసింది.