Site icon NTV Telugu

Kate middletons: తప్పు అంగీకరించిన బ్రిటన్‌ రాజకుటుంబం

Ki

Ki

బ్రిటన్ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ ఫొటోపై పెద్ద దుమారమే చెలరేగింది. అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పిల్లలతో కలిసి ఉన్న కేట్ మిడిల్టన్ ఫొటో ఎడిట్ చేశారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో మొత్తానికి రాజకుటుంబం దిగొచ్చింది. దీనిపై క్షమాపణ కోరింది. ఆ ఫొటో ఎడిట్ చేసిన ఫొటోనేనని తప్పు అంగీకరించారు.

మదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఫొటోలో జీన్స్, స్వెటర్, ముదురు జాకెట్ ధరించి.. నవ్వుతున్న వేల్స్‌తో కుర్చీలో కూర్చుని.. ఆమె ముగ్గురు పిల్లలతో యువరాణి కలిసి ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ ఫొటోలో కేట్‌ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్‌మెంట్‌లో లేకపోవడంతో అది నిజమైంది కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా కేట్‌ చేతికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ లేకపోవడంతో ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి జరిగిన తప్పును అంగీకరిస్తూ కేట్ క్షమాపణ కోరింది.

కేట్‌ మిడిల్టన్‌ గత జనవరి నుంచి అదృశ్యమయ్యారు. కడుపులో ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందని వార్తలు వినబడ్డాయి. అప్పటి నుంచి ఆమె అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలైన వాదనలు పుట్టుకొచ్చాయి. సీరియస్‌గా ఉందని కొందరు.. ఇంకేదో అయిందని మరికొందరు పుకార్లు సృష్టించారు. అయినా కూడా ఇప్పటి వరకు రాజకుటుంబం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా రాజకుటుంబం నుంచి కేట్ మిడిల్టన్‌కు సంబంధించిన ఫొటోను విడుదల చేసి విమర్శల పాలైంది. దీంతో ఆమె ఆరోగ్యం గురించి మరోసారి చర్చ సాగింది. అయినా కూడా ఇంత జరుగుతున్నా.. ఆమె మాత్రం రియల్‌గా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమెకు ఏదో అయిందనే జోరుగా చర్చ సాగుతోంది.

కేట్‌కు శస్త్రచికిత్స తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది. వాస్తవానికి శస్త్రచికిత్స జరిగితే మూడ్రోజుల్లోనే తిరిగి కోలుకోవచ్చు. కానీ ఇన్ని రోజులు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఎందుకుంటారు? అంటే ఏదో జరిగిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అసలేం జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

 

Exit mobile version