NTV Telugu Site icon

P M Modi: ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళి…

Prime Minister

Prime Minister

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు. లడఖ్‌లోని ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ను కూడా ప్రధాని మోడీ నేడు సందర్శించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో ద్రాస్ ఒక పట్టణం అని తెలిసిందే. దీనిని లడఖ్‌కు గేట్‌వే అని కూడా అంటారు. ప్రధాని మోడీ కంటే ముందు ఆర్మీ చీఫ్ ద్రాస్‌లో అమరవీరులకు నివాళులర్పించారు.

READ MORE: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..

కాగా.. ఈ మధ్య కశ్మీర్ లో ఉగ్రదాడులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్‌లీస్ట్‌లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0‌ను స్టార్ట్ చేయబోతుంది. అయితే, ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని మోడీ ఆఫీసులో నుంచే పర్యవేక్షిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేశారు.