Site icon NTV Telugu

పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నారు. ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లిన మోడీ…అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు…ఇరు వైపుల అధికారులు సమావేశం సమయాన్ని నిర్ణయించి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

పోప్‌తో సమావేశంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని… త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 30న పోప్ ఫ్రాన్సిస్‌ని… మోడీ కలుసుకోనున్నట్లు హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. ఇటలీ రాజధాని రోమ్‌లో నేటి నుంచి… రెండ్రోజుల పాటు జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు…ప్రధాని మోడీ వెళ్లనున్నారు. గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. కోవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. 2019లో ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సుకు… మోడీ చివరిసారిగా హాజరయ్యారు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశానికి హాజరు కానున్నారు.

Exit mobile version