NTV Telugu Site icon

PM Modi: నేడు బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు

Modi

Modi

నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కోనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి.. అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

ఇక, బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6న మరణించారు. డాక్టర్. బీఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో విద్యతో పాటు వారికి సరైన హక్కులను కల్పించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త అలాగే, సంఘ సంస్కర్త కూడా.. ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారు.. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. దళిత నేపధ్యం నుంచి వచ్చిన అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుపడుతూ భారత రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు.

Show comments