Site icon NTV Telugu

‘మీది చనిపోయే వయసు కాదు’.. పునీత్ మృతిపై ప్రధాని మోదీ ట్వీట్

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భారత ప్రధాని మోదీ కూడా పునీత్ మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘విధి ఎంతో క్రూరమైనది. పునీత్‌ రాజ్‌కుమార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి నటుడిని మనందరికీ దూరం చేసింది. పునీత్ రాజ్‌కుమార్ కృషి, వ్యక్తిత్వం భవిష్యత్ తరాలలో స్ఫూర్తి నింపుతుంది. మీది చనిపోయే వయసు కాదు. పునీత్ కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అంటూ ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

Read Also: తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు

కాగా పునీత్ రాజ్‌కుమార్ కేవలం సినిమాలతోనే కాదు.. నిజ జీవితంలో గొప్ప సామాజిక సేవలోనూ స్టార్‌గానే ఉన్నాడు. కర్ణాటకలో 45 పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు పునీత్‌ సహకారంతో నడుస్తున్నాయి. 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్య, మైసూరులోని ఆడ పిల్లల చదువులకు ఆయన ఆర్థిక సాయం చేస్తున్నాడు. ఇప్పుడు చనిపోతూ కూడా.. రెండు కళ్లూ దానం చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Exit mobile version