NTV Telugu Site icon

Anant Ambani Wedding: “శుభ్ ఆశీర్వాద్” వేడుకకు హాజరైన ప్రధాని మోడీ..

Modi Attend Ambani Wedding

Modi Attend Ambani Wedding

నూతన వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం శుక్రవారం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆశీర్వాద వేడుకలు నిర్వహిస్తున్నారు.

READ MORE: Seethakka: దాసరి మల్లమ్మ ఆసరా పెన్షన్ రికవరీ నోటీసులపై మంత్రి సీత‌క్క వివరణ..

ప్రధాని మోడీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకోగానే ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అనంత్, ఆకాష్ ఇద్దరూ పాదాలను తాకి ప్రధాని మోడీ ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం.. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్ మరియు మాధురీ దీక్షిత్‌లతో సహా భారతదేశం, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అమెరికన్ రియాలిటీ టీవీ ఆర్టిస్ట్ కిమ్ కర్దాషియాన్ మరియు ఆమె సోదరి ఖ్లో కర్దాషియాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అమితాబ్ బచ్చన్ రంగురంగుల కుర్తా-పైజామా మరియు శాలువా ధరించి ఫంక్షన్‌కు వచ్చారు. ఈ సమయంలో మనవరాలు నవ్య నంద, అల్లుడు నిఖిల్ నంద కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Anant Ambani Wedding: శుభ్ ఆశీర్వాద్‌కు హాజరైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్

కాగా.. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతుల్ని.. ముఖేష్ అంబానీ.. చంద్రబాబు దంపతులకు పరిచయం చేశారు. చంద్రబాబు ప్రత్యేకంగా అనంత్ అంబానీతో ముచ్చటించారు. నూతన దంపతులైన అనంత్, రాధికను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు.