పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కకర్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్లు, రైల్వేలు, సముద్ర వ్యవహారాల తాత్కాలిక మంత్రి షాహిద్ అష్రఫ్ తరార్‌ను కమిటీకి అధిపతిగా నియమించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Read Also: Minister Gummanur Jayaram: అజ్ఞాతంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. విషయం అదేనా..?
కాగా, కమిటీలోని ఇతర సభ్యులలో హోం సెక్రటరీ, నలుగురు ప్రావిన్షియల్ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు పరిపాలనా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను సమీక్షించి పరిష్కరించడం.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వహించాల్సి ఉంటుంది. దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత తాత్కాలిక ప్రధాని కాకర్‌పై ఉంది. అయితే అతను సైనిక-మద్దతుగల రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాడని పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు.
Read Also: KCR: అయోధ్య రామాలయ ప్రారంభానికి కేసీఆర్‌కు ఆహ్వానం.. వెళతారా?
అయితే, ఎన్నికలకు ముందు కూడా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ‘పూర్వ ఎన్నికల రిగ్గింగ్’ కారణంగా దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశించడం లేదని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది. పాకిస్తాన్ ప్రజల మానసిక స్థితి ఏమిటి? అనేది ఎవరికి తెలియదు అని చెప్పుకొచ్చింది.