Site icon NTV Telugu

Priest: వాటర్ ట్యాంక్ ఎక్కి పురోహితుడు హల్ చల్.. కారణం ఇదే!

Priest

Priest

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మిషన్ భగీరథా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కాళేశ్వరంకి చెందిన ముమ్మడి రాకేష్ అనే తీర్థ్ర పురోహితుడుని గోదావరి వద్ద శ్రాద్ధకర్మ పూజలకు బ్రహ్మణ సంఘం సభ్యులు నిరాకరించారు.. దీంతో మనస్థాపం చెందిన రాకేష్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానాని నిరసన తెలిపాడు. గత 3 సంవత్సరాలుగా గోదావరి వద్ద శ్రాద్ధ కర్మ పూజలు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు రాకేష్..

Also Read:POCSO Court: పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా.. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం

బ్రహ్మణ సంఘంలో సభ్యులు ఎక్కువ అయ్యారని, కొన్ని రోజులు రావద్దంటు సూచించారు సంఘం సభ్యులు.. అయితే విశ్వకర్మ కులానికి చెందినవాడినని తక్కువగా చూస్తున్నారని, దీని కారణంగా నిరాకరిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మణ సంఘం సభ్యులు యధావిధిగా శ్రాద్ధకర్మ పూజలు చేసుకోవడానికి అనుమతించడంతో తీర్థ్ర పురోహితుడు రాకేష్ వాటర్ ట్యాంక్ పై నుంచి కిందికి దిగొచ్చాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version