కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు చాలా ప్రియం గురూ.. సామాన్య మానవులు పప్పులను కొనాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. మొన్నటికి మొన్న వంట నూనెల ధరలు పెరిగి.. మళ్లీ తగ్గుముఖం పట్టాయని ఆనందపడుతున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది.
Read Also: Tirupathi : బాణాసంచా కేంద్రంలో మంటలు.. ముగ్గురు సజీవదహనం..
20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. మసూర్ దాల్ కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. పల్లీల రేటు కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాలు, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది.
Read Also: Chinna Reddy: రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం
మరోవైపు పప్పుల ధరలు పెరగడంతో అప్పుడే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కందిపప్పుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు బ్లాక్ దందా చేస్తున్నారు. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయంటున్నారు. దీనివల్ల త్వరలోనే కిలో కందిపప్పు ధర రిటైల్ మార్కెట్‌లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పప్పు రేట్లు పెరిగినా, ఉప్పు రేట్లు పెరిగినా అది సామాన్య మానవుడికేనని ఆరోపిస్తున్నారు జనాలు.