Site icon NTV Telugu

Price Down: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన నిత్యావసరాల ధరలు

Grocery

Grocery

Price Down: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాల నిత్యావసరాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వంట నూనెల దగ్గరి నుంచి ఉల్లిపాయల వరకు పలు వస్తువుల ధరలు దిగి వచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత నెల రోజుల కాలంలో 11 నిత్యావసర ఫుడ్ ఐటమ్స్ ధరలు 2 నుంచి 11 శాతం మేర తగ్గాయి. ట్విట్టర్ వేదికగా ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రకటించారు. దీంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ దిగివచ్చిందని చెప్పుకోవచ్చు.

పామ్ ఆయిల్ ధర సగటును 11 శాతం మేర తగ్గింది. అక్టోబర్ 2న పామ్ ఆయిల్ రేటు రూ.118గా ఉంది. సెప్టెంబర్ 2న పామ్ ఆయిల్ ధర లీటరుకు రూ. 132గా ఉంది. వనస్పతి నెయ్యి ధర 6 శాతం మేర దిగి వచ్చింది. గత నెలలో దీని రేటు కేజీకి రూ. 152 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు దీని ధర రూ. 143 మేర దిగివచ్చింది. పప్పుదినుసులు రేటు కూడా తగ్గింది. గ్రామ్ దాల్ రేటు 4 శాతం తగ్గింది. కేజీకి రూ. 74 నుంచి రూ. 71కు క్షీణించింది. అలాగే మసూర్ దాల్ రేటు కేజీకి రూ. 97 నుంచి రూ. 94కు దిగివచ్చింది. 3 శాతం క్షీణత నమోదైంది. అలాగే ఉరద్ దాల్ రేటు 2 శాతం తగ్గుదలతో కేజీకి రూ. 108 నుంచి రూ. 106కు తగ్గింది.

Read Also: Sova virus: బ్యాంకింగ్ యాప్స్‎కు ‘సోవా’ ముప్పు

ఇక ఉల్లిపాయల ధరలు కూడా తగ్గాయి. వీటి రేటు 8 శాతం పడిపోయింది. గత నెలలో కేజీకి రూ. 26గా ఉన్న ఉల్లిపాయల ధరలు ఇప్పుడు రూ. 24కు తగ్గింది. పొటాటో రేటు కూడా 7 శాతం దిగివచ్చింది. కేజీకి రూ. 28 నుంచి రూ. 26కు తగ్గింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు కూడా పడిపోయింది. దీని ధర 6 శాతం క్షీణించింది. గత నెలలో లీటరుకు రూ. 176గా ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు రూ. 165కు దిగి వచ్చింది. వంటనూనెల ప్యాకెట్ల విషయంలో ఇదే జరుగుతోంది. 21 డిగ్రీల సెల్సియస్ దగ్గర నూనె ప్యాకెట్ బరువు 919 గ్రాములు ఉంటుందని ప్యాకెట్‌పై వెల్లడించారనుకుందాం. కస్టమర్ ఆ ప్యాకెట్ కొనేప్పుడు అంతే ఉష్ణోగ్రత ఉండదు. గది ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకుంటే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. అప్పుడు ప్యాకెట్ బరువు తక్కువగా ఉంటుంది. అలాగే సోయాబీన్ ఆయిల్ రేటు కూడా తగ్గింది. 5 శాతం మేర క్షీణించింది. గత నెలలో లీటరుకు రూ. 156 వద్ద ఉన్న ఈ ఆయిల్ రేటు ఇప్పుడు రూ. 148కి తగ్గింది. దేశంలో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయని కేంద్రం పేర్కొంటోంది.

Exit mobile version