వంటగదిలో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక అద్భుతమైన సాధనం. వంటరాని వారు కూడా అన్నం, పప్పు, చికెన్ వంటివి త్వరగా వండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే “కుక్కర్ లేనిదే చేయి విరిగినట్లు ఉంటుంది” అని అమ్మలు అంటుంటారు. అయితే, కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. విజిల్ వచ్చినప్పుడు లోపల ఉన్న నీరు లేదా నురుగు బయటకు లీక్ అవ్వడం. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పప్పులో ఉండే స్టార్చ్ ఉడికేటప్పుడు ఆవిరి ఒత్తిడికి బయటకు చిమ్ముతుంది, దీనివల్ల స్టవ్.. కుక్కర్ మొత్తం జిడ్డుగా మారి శుభ్రం చేయడం కష్టమవుతుంది.
Also Read : Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
ఈ సమస్యను దూరం చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. మొదటిది, కుక్కర్‌లో పప్పు లేదా బియ్యం వేసేటప్పుడు ఎప్పుడూ నిండుగా నింపకూడదు; సగం వరకు మాత్రమే నింపితే నురుగు పైకి వచ్చినా బయటకు పొంగదు. రెండో చిట్కా ఏంటంటే, పప్పు ఉడికించేటప్పుడు ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి కలిపితే నురుగు తక్కువగా వస్తుంది. ఒకవేళ నూనె వాడటం ఇష్టం లేకపోతే, కుక్కర్ మూత పెట్టే ముందు లోపల ఒక చిన్న స్టీల్ చెంచాను వేయండి. ఇది బుడగలను పగలగొట్టి నురుగు బయటకు రాకుండా చూస్తుంది. అలాగే, వండటానికి ముందు పప్పును కాసేపు నానబెట్టడం వల్ల స్టార్చ్ తగ్గి సమస్య పరిష్కారమవుతుంది.
