Site icon NTV Telugu

Operation Sindoor: మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం

Modi

Modi

భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, మేజర్ జనరల్ ఎస్.ఎస్. శారద, వైస్ అడ్మిరల్ ఏ.ఎన్.ప్రమోద్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి” ఈ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

Also Read:Amritsar Spurious LiquorG: కాటికి పంపిన కల్తీ మద్యం.. 14 మంది మృతి

ఆపరేషన్ సిందూర్”విజయవంతం, రక్షణ, భద్రతా బలగాలు నిర్వహించిన పాత్ర, ఆధారాలతో కూడిన మరిన్ని వివరాలను అందించే అవకాశం ఉంది. ప్రతి బుధవారం కేంద్ర కాబినెట్ సమావేశం అవడం మామూలే అయినా, రేపటి సమావేశం ప్రత్యేకత సంతరించుకున్నది. ఆపరేషన్ సిందూర్” విజయం పై ప్రధాని మోడికి అభినందనలు తెలుపుతూ కేంద్ర కాబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. పెహల్గాం ఉగ్రదాడి లో మృతి చెందిన పర్యాటకులను “అమర వీరులు” గా గుర్తించాలన్న, కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. ఆపరేషన్ సింధూర్” లో మృతి చెందిన వీర జవాన్లు, రక్షణ బలగాల అధికారులకు సముచిత రీతిలో గౌరవించే అంశం పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version