Telangana Election: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్ కోట్ గ్రామంలోని కోటవీధిలో పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కలకలం. పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతుండగా పోలీసులను చూసి డబ్బులు వదిలేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. 7 లక్షల 45 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. రహస్యంగా వినియోగించాల్సిన తన ఓటు హక్కును బహిరంగంగానే వేశారు. రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాలను భేఖాతర్ చేయడం సరైంది కాదని భావిస్తున్నారు.
Read Also:Telangana Elections 2023: జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
