Site icon NTV Telugu

PM Modi: నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!

Pm Modi

Pm Modi

PM Modi: రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. సమాజానికి వారు చేసిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరిగింది. ఖాళీల భర్తీ నేపథ్యంలో వీరి నామినేషన్ జరిగింది. నామినేట్ చేసిన వారిలో ఉజ్వల్ నికమ్, సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, డా. మీనాక్షి జైన్ లు ఉన్నారు. ఇక వీరి వివరాలు పరిశీలిస్తే..

Read Also:Kollu Ravindra: పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా..

ఉజ్వల్ నికమ్ 26/11 ముంబయి దాడుల్లో కసబ్ కేసు ప్రాసిక్యూటర్‌గా నిలిచిన ప్రఖ్యాత న్యాయవాదిగా గుర్తింపు పొందారు. సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్తగా ప్రసిద్ధి గాంచారు. ఇక హర్షవర్ధన్ ష్రింగ్లా మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యనాయకుడుగా ఉన్నారు. చివరిగా డా. మీనాక్షి జైన్ చరిత్రకారిణి, రాజకీయ శాస్త్రవేత్త, విద్యావేత్తగా పేరుగాంచారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ట్వీట్లు చేశారు.

ఆయన ఉజ్వల్ నికమ్ గురించి మాట్లాడుతూ.. ఆయన న్యాయవాద వృత్తిలో రాజ్యాంగ విలువల పట్ల చూపిన నిబద్ధతను మోదీ ప్రశంసించారు. నికమ్ సాధారణ పౌరుల పక్షాన నిలవడాన్ని గుర్తుచేశారు. అలాగే సదానందన్ మాస్టర్ పై మోదీ స్పందిస్తూ.. ఆయన ధైర్యానికి, సామాజిక సేవకు ప్రశంసల వర్షం కురిపించారు. అన్యాయానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటాలు దేశానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

Read Also:Teenmaar Mallanna: ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కార్యకర్తల దాడి..!

హర్షవర్ధన్ ష్రింగ్లా గురించి ప్రధాని మాట్లాడుతూ.. ఆయన వ్యూహాత్మక ఆలోచనాపరుడు, విదేశాంగ విధానాల్లో కీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త అని కొనియాడారు. అలాగే డాక్టర్ మీనాక్షి జైన్ సేవలను మోదీ వివరించారు. ఆమె విద్య, చరిత్ర, సాహిత్యం రంగాల్లో చేసిన కృషి విద్యారంగాన్ని సుసంపన్నం చేసిందని పేర్కొన్నారు. ఈ నామినేషన్లతో రాజ్యసభకు ప్రజా జీవితంలో అనుభవం కలిగిన వివిధ రంగాల ప్రముఖులు ప్రాతినిధ్యం వహించనుండడం విశేషం.

Exit mobile version